Home  »  TV News  »  Karthika Deepam2: వంటలక్క అల్టిమేట్ ప్లాన్.. జ్యోత్స్నకు మైండ్ బ్లాంక్ అయ్యేలా షాకిచ్చిన కార్తీక్!

Updated : Jun 23, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం-2(Karthika Deepam2)'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్- 703లో .. శివన్నారాయణ, దశరథ్, సూరజ్, దీప, జ్యోత్స్న అంతా కలిసి మాట్లాడుకుంటారు. ఇంత ఫుడ్ వేస్ట్ చేస్తే నాకు చాలా కోపం వస్తుంది. ‌మీరేం చేస్తారో నాకు తెలియదు.. నష్టం రాకుండా చూస్కోండి అని శివన్నారాయణ చెప్తాడు. దాంతో సూరజ్, దీప ఇద్దరు కలిసి ఒక ప్లాన్ చెప్తారు. 

మనం ఒక ఆఫర్ పెడుతున్నాం.. వంటలక్క స్పెషల్ మీల్స్ .. లాటరీ ఉంది.. గోల్డ్ కాయిన్స్, అండ్ ఫస్ట్ పది మందికి లాటరీ టికెట్స్ ఉంటాయని సూరజ్, దీప చెప్పగానే ఇప్పటికే లాస్ లో ఉన్నాం.. ఇక ఈ గోల్డ్ కాయిన్, లాటరీ టికెట్స్ అంటే ఇంకా నష్టాల్లోకి వెళ్తామని జ్యోత్స్న అనగానే దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. దీనిని ఫ్లాష్ సేల్ లాగా సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేస్తే జనాలు ఎక్కువగా తీసుకుంటారు. మన ఫుడ్ ని అన్ని రెస్టారెంట్ లకి పంపిస్తే సరిపోతుందని సూరజ్ చెప్తాడు. ఇక మిగిలిన దానిని అనాధాశ్రమానికి ఇవ్వాలని దీప అనగానే సరే నేను ఒప్పుకుంటున్నా అని శివన్నారాయణ అంటాడు. ఇక కార్తీక్, దీప, సూరజ్ అంతా కలిసి ఫుడ్ ను అన్ని రెస్టారెంట్ లకి పంపిస్తారు. ఇక జ్యోత్స్న వాళ్ళని డిస్కరేజ్ చేస్తూ దీప, సూరజ్ లని తక్కువ చేసి మాట్లాడుతుంది.

ఇక కాసేపటికి ఒక రెస్టారెంట్ నుండి గణపతి అనే మేనేజర్ దీపకి కాల్ చేస్తాడు.  అప్పుడు అక్కడ శివన్నారాయణ, దశరథ్, సూరజ్, జ్యోత్స్న, కార్తీక్ అందరు ఉంటారు. ఫోన్ ను స్పీకర్ లో పెట్టమని కార్తీక్ చెప్పగానే దీప స్ఫికర్ లో పెడుతుంది. అప్పుడు అటునుండి గణపతి అనే మేనేజర్ కాల్ చేస్తాడు. మీరు ఇచ్చిన ఆఫర్ కి జనాలు ఎగబడి ఆర్డర్ చేసుకున్నారు. బాగా సేల్ అవుతున్నాయి. నాకు తెలిసి అన్నీ పూర్తయ్యాయి.. మీరు ఇంకా పంపిస్తే బాగుంటుందని అతను అనగానే దీపతో పాటు కార్తీక్, సూరజ్, శివన్నారాయణ,  దశరథ్ అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు.  ఇక అక్కడే ఉన్న జ్యోత్స్నకి దిమ్మతిరిగే పంచ్ ఇస్తాడు కార్తీక్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.